ప్రాజెక్ట్‌లు అభివృద్ధి చెందుతున్నాయ్‌

కాకతీయ కాలువపై నిర్మించే వంతెనకు శంకు స్థాపన చేస్తున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి  - Sakshi

బాల్కొండ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక నీటి ప్రాజెక్ట్‌లు అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గురువారం మెండోరా మండలం పోచంపాడ్‌లో పోచంపాడ్‌, సోన్‌పేట్‌ గ్రామాల మధ్య నూతన వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక అభివృద్ధికి నిదర్శనం శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టేనన్నారు. కాకతీయ కాలువ వంతెనపై దేశంలో ఎక్కడాలేని విధంగా కొత్త టెక్నాలజీతో వంతెన నిర్మిస్తున్నామన్నారు. రూ. 1.35 కోట్ల నిధులను సీఎం కేసీఆర్‌ స్వయంగా మంజూరు చేశారన్నారు. వంతెన నిర్మాణాన్ని మూడు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. కాకతీయ కాలువపై వంతెన నిర్మాణానికి కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బురుకుల సుకన్య, జెడ్పీటీసీ తలారి గంగాధర్‌, సర్పంచ్‌లు మిస్బా, ప్రకాశ్‌, వేల్పూర్‌ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ అరుణ, ఎంపీటీసీ సభ్యుడు జాన్‌బాబు, కోఆప్షన్‌ సభ్యుడు బాబా, ప్రాజెక్ట్‌ ఎస్‌ఈ శ్రీనివాస్‌, ఈఈ చక్రపాణి, బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read latest Nizamabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top