
సైనికుడి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి
తాడ్వాయి: దేశ రక్షణ కోసం యువత ముందుకు రావాలని ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. చిట్యాల గ్రామంలో సోమవారం దివంగత ఆర్మీ జవాన్ కంది సిద్దిరాములు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిద్దిరాములు దేశ రక్షణలో వీరమరణం పొందారన్నారు. ఆయన స్ఫూర్తితో యువత సైన్యంలో చేరాలని, ఇంటికో సైనికుడు తయారు కావాలని సూచించారు. సిద్దిరాములు తల్లి తన పింఛన్ డబ్బుల కొడుకు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. సిద్దిరాములు కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఎస్పీ అన్యోన్య, సీఐ శ్రీనివాస్, ఎస్సై ఆంజనేయులు, భువనేశ్వర్, ఎంపీటీసీ రాజమణి, సిద్దిరాములు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.