నిర్మల్‌చైన్‌గేట్: తెలంగాణలో ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర కిసా న్ మోర్చా కార్యదర్శి పడిపెల్లి గంగాధర్ డిమాండ్ చేశారు. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు జక్కుల సత్తయ్య యాదవ్ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో అన్నదాతలు నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. దేశంలోని 23 రాష్ట్రాల్లో పథకం అమలు చేస్తుండగా, తెలంగాణలో ఎందు కు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రైతుల ఆ దాయ భద్రత, వ్యవసాయ స్థిరత్వం కోసం, ప్రస్తు త ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ఫసల్ బీమా అ త్యంత అవసరమని అభిప్రాయపడ్డారు. జిల్లా ప్రధాన కార్యదర్శి నల్ల రవీందర్‌రెడ్డి, జిల్లా కార్యాలయ కార్యదర్శి రాచకొండ సాగర్, జిల్లా మీడియా కన్వీనర్ బుర్ర రమేశ్‌గౌడ్, బీజేపీ నాయకులు కు మ్మరి వెంకటేశ్, సూరజ్, అయిండ్ల సాత్విక్, గణేశ్ కులకర్ణి, నారాయణ, తిరుమలేశ్ పాల్గొన్నారు.


