లక్ష్మణచాంద: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థులు, కాంగ్రెస్ సాధించిన విజయంగా పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావు పేర్కొన్నారు. శనివారం కనకాపూర్ చౌరస్తాలో ఆయన మాట్లాడారు. నీట్ పేపర్ లీకేజీతో లక్షలాదిమంది విద్యార్థుల జీవితాలు తారుమారయ్యాయని తెలిపారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవడంతో కేంద్ర మంత్రి రాజీనామా చేయడం విద్యార్థులు, కాంగ్రెస్ సాధించిన విజయంగా పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏఎంసీ చైర్మన్ భీంరెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాస్, పార్టీ మండలాధ్యక్షుడు నరేశ్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు రాజేశ్వర్, నాయకులు ప్రతాప్‌రెడ్డి, వెంకటరాజు, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


