నిర్మల్ రూరల్: ఉపాధ్యాయులు, ఉద్యోగుల హక్కుల సాధనకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 1న హైదరాబాద్‌లో తలపెట్టిన మహాధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను జిల్లా కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు శశిరాజ్ మాట్లాడుతూ.. ధర్నాకు ఉపాధ్యాయులు, ఉద్యోగులంతా హాజరై విజయవంతం చేయాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సుదర్శన్, రాష్ట్ర బాధ్యుడు రాజేశ్వర్, జిల్లా బాధ్యులు ముత్యం, అశోక్, రాజేశ్వర్, వాసుదేవరెడ్డి, అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.
పోస్టర్ ఆవిష్కరిస్తున్న ఉపాధ్యాయులు


