జిల్లాలో వెదురు సాగుకు అనుకూలమైనవిగా సారంగపూర్, మామడ, పెంబి మండలాలను మొదటి విడతలో సర్వే చేసి గుర్తించాం. సెర్ప్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించాం. 338 మంది రైతులు 2వేల ఎకరాల్లో సాగు చేసేందుకు ముందుకువచ్చారు. ఒక్కో రైతుకు సాగు నిర్వహణ కోసం మూడేళ్లలో రూ.1.12లక్షలు అందజేస్తాం.
– విజయలక్ష్మి, డీఆర్డీవో
రైతులకు అదనపు ఆదాయం
వెదురు సాగుతో రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుంది. పంట సాగు ఆరంభంలో అంతర పంటలు సాగు చేసుకోవచ్చు. వెదురు సాగు చేసేందుకు చాలామంది రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. పంట సాగుతో కలిగే లాభాలను రైతులకు వివరించాం. సాగులో మెళకువలు తెలిపాం. ఆసక్తిగల రైతులు సాగుకు ముందుకు రావాలి.
– బీక్‌సింగ్, సెర్ప్ సీసీ, మామడ


