నిర్మల్‌చైన్‌గేట్: ప్రభుత్వ బడుల్లో డ్రాపౌట్స్ లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధి కారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ స మావేశ మందిరంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, సౌకర్యాలు తదితర అంశాల గురించి తెలుసుకున్నారు. రోజూ తప్పనిసరిగా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు నమోదు చేయాలని చెప్పారు. ఉపాధ్యాయుల హాజరు రోజూ 90శాతానికి తగ్గకుండా చూడాలని సూచించారు. నూతన విద్యార్థుల ఎఫ్‌ఆర్‌ఎస్ రిజిస్ట్రేషన్ మిగిలి ఉంటే పూర్తి చేయాలని తెలిపారు. బడికి దీర్ఘకాలికంగా హాజరుకాని విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారు వచ్చేలా చొర వ చూపాలని సూచించారు. విద్యార్థుల అపార్ ఐడీ నమోదు పూర్తి చేయాలని, ఐడీ నమోదులో సాంకేతిక ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో పిల్లల సంఖ్య మరింత పెంచేలా చూడాలని తెలిపారు. అ ధునాతన బోధన పద్ధతులు, బృంద చర్చలు, వి ద్యార్థులు–ఉపాధ్యాయుల ముఖాముఖి, నిరంతర ప్రోత్సాహం తదితర అంశాల ద్వారా చదువులో వె నుకబడిన పిల్లల ప్రగతికి పాటుపడాలని సూచించారు. ఎప్పటికప్పుడు పోషకులతో సమావేశాలు నిర్వహిస్తూ, అన్ని విషయాలు చర్చించాలని తెలిపా రు. పదోతరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. డీఈవో భోజన్న, ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, అధికారులు పాల్గొన్నారు.


