నిర్మల్‌చైన్‌గేట్: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నిర్మల్ కొయ్య బొమ్మలకు రాష్ట్ర ప్రభుత్వం సరైన గుర్తింపు ఇవ్వడంలేదని బీజేపీ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ఆరోపించారు. బుధవారం బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డితో కలిసి నిర్మల్ కొయ్యబొమ్మలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొనికి చెట్లు పెంచకపోవడంతో కొయ్యబొమ్మల తయారీకి తీవ్ర అంతరాయం కలుగుతోందని తెలిపారు. నిర్మల్ బొమ్మలకు మార్కెటింగ్ అవకాశాలను మరింత మెరుగుపరిచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాజాగా ప్రధాని మోదీ నిర్మల్ బొమ్మలకు జీఐ ట్యాగ్ (భౌగోళిక గుర్తింపు) కల్పించి, మార్కెటింగ్‌కు సరైన అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందేలా కృషి చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్‌రావు, జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్ నాయకులు రావుల రాంనాథ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
సేంద్రియ రైతులతో ఆత్మీయ సమావేశం
సహజ ఎరువులతో సేంద్రియ వ్యవసాయం చేస్తు న్న రైతులతో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, నాయకులు గౌతమ్‌రావు, రితేశ్ రాథోడ్, రాంనాథ్ పాల్గొన్నారు.


