కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలి

Jul 19 2026 11:27 PM | Updated on Jul 19 2026 11:27 PM

నిర్మల్‌టౌన్‌: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులకు తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జిల్లా కళాకారులు ఆదివారం ప్రొఫెసర్‌ కోదండరామ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్‌లోలో ఎమ్మెల్సీని కలిసి ఉద్యమ సమయంలో కళాకారులు చేసిన సేవలను గుర్తించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ సారథ్యంలో తగిన ఉద్యోగాలు కల్పించేలా ప్రభుత్వానికి సూచనలు చేయాలని కోరారు. కార్యక్రమంలో నిర్మల్‌ జిల్లా సీనియర్‌ జానపద కళాకారులు ఎక్కొండ ధనరాజ్‌, మహిపాల్‌, సురేశ్‌, మమత, సాయికృప, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement