ఉపాధ్యాయులు నైపుణ్యం పెంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయులు నైపుణ్యం పెంచుకోవాలి

Jul 18 2026 11:57 PM | Updated on Jul 18 2026 11:57 PM

● డీఈవో భోజన్న

● డీఈవో భోజన్న

నిర్మల్‌ రూరల్‌: ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు నైపుణ్యాలు పెంచుకోవాలని డీఈవో భోజన్న సూచించారు. జిల్లా కేంద్రంలోని నారాయణ పాఠశాలలో సాంఘిక శాస్త్రం, జీవశాస్త్ర ఉపాధ్యాయులకు మూడు రోజులుగా జరుగుతున్న శిక్షణ తరగతులు శనివారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి డీఈవో హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు నేటితరం విద్యార్థులకు అనుగుణంగా విద్యాబోధన చేయాలని సూచించారు. విద్యార్థుల స్థాయికి అనుగుణంగా పాఠాలు నేర్పాలని, సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దేలా బోధించాలని తెలిపారు. ఇందులో ఏఎంవో నరసయ్య, కోర్స్‌ డైరెక్టర్లు రామచందర్‌, శ్రీనివాస్‌రెడ్డి, రిసోర్స్‌ పర్సన్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement