బైక్‌చోరీ ముఠా అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

బైక్‌చోరీ ముఠా అరెస్ట్‌

Jul 18 2026 11:57 PM | Updated on Jul 18 2026 11:57 PM

ఆదిలాబాద్‌టౌన్‌: బైక్‌ చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్‌ ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌ సమావేశ మందిరంలో శనివారం వివరాలు వెల్లడించారు. జిల్లాలో వాహన చోరీలకు పా ల్పడుతున్న ముఠా కేసును టూటౌన్‌ పోలీసులు ఛేదించారని తెలిపారు. గతేడాది డిసెంబర్‌ 23న రా త్రి జైనథ్‌ మండలానికి చెందిన ఫొటోగ్రాఫర్‌ కుంట రవితేజ తన బైక్‌ను జిల్లా కేంద్రంలోని హోటల్‌ స మీపంలో పార్కింగ్‌ చేశాడు. గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, సీసీ ఫుటే జీ ఆధారంగా దర్యాప్తు చేపట్టి నలుగురు నిందితుల ను అరెస్ట్‌ చేసి, వారి నుంచి దొంగిలించిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అరెస్ట్‌ అ యిన వారిలో ఇంద్రానగర్‌కు చెందిన కరణ్‌ షిండే, మెస్రం సాయికిరణ్‌, ఫర్దీన్‌ ఖాన్‌, గాంధీనగర్‌కు చెందిన పవార్‌ విక్రమ్‌లు ఉండగా, భాగ్యనగర్‌కు చెందిన అబ్దుల్‌ సాహిల్‌, ఇంద్రానగర్‌కు చెందిన అజర్‌ ఖాన్‌, పొల్లేకర్‌ గణేష్‌ పరారీలో ఉన్నట్లు వివరించారు. సమావేశంలో డీఎస్పీ ఎల్‌.జీవన్‌రెడ్డి, టూటౌన్‌ సీఐ నాగరాజు, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌, ఎస్సైలు ప్రణయ్‌, విష్ణుప్రకాష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement