అగ్రికల్చర్‌ గోదాంకు శంకుస్థాపన | - | Sakshi
Sakshi News home page

అగ్రికల్చర్‌ గోదాంకు శంకుస్థాపన

Jul 17 2026 3:46 AM | Updated on Jul 17 2026 3:46 AM

నిర్మల్‌ రూరల్‌: మండలంలోని కౌట్ల(కె) గ్రామంలో రూ.30 లక్షలతో ఫుడ్‌గ్రైన్‌ స్టోరేజీ అగ్రికల్చర్‌ గో దాం నిర్మాణానికి ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి గురువా రం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేసుకునేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. గోదాం నిర్మాణం పూర్తయిన తర్వాత రైతులకు ధాన్యం నిల్వ సులభం అవుతుందని పేర్కొన్నారు. ఇందులో సర్పంచ్‌ రాజు, నాయకులు జమాల్‌, వెంకట్‌రెడ్డి, నర్సారెడ్డి, కొండ శ్రీనివాస్‌, గడ్డం హరీశ్‌, భూమేష్‌ పాల్గొన్నారు. అనంతరం డ్యాంగాపూర్‌లోని ఎస్‌ఆర్‌ ప్రైమ్‌స్కూల్‌ ఆవరణలో మొక్కలు నాటారు. ఇందులో సర్పంచ్‌ నవీన్‌, నాయకులు జమాల్‌, శ్రీనివాస్‌, నరేందర్‌, కౌన్సిలర్లు గంజి రాజు, నరేశ్‌, జింక సూరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement