సారంగపూర్: మండల కేంద్రంలోని ప్రభు త్వ జూనియర్ కళాశాలలో స్థానిక డీఆర్వో నజీర్‌ఖాన్, ప్రముఖ స్నేక్ క్యాచర్ యాసీన్ ఆధ్వర్యంలో ప్రపంచ పాముల దినోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా డీఆర్వో, స్నేక్ క్యాచర్ విష రహిత, విష సహిత పా ముల గురించి విద్యార్థులకు అవగాహన క ల్పించారు. పాములు పర్యావరణానికి మేలు చేసే విధానాలు తెలియజేశారు. జీవ వైవి ద్యంలో పాములపాత్ర గురించి తెలిపారు. విష రహిత, విష సహిత పాముల ముఖాల పై ఉండే వివిధ ఆకారాలను వివరించారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ శ్రీనివాస్ పాల్గొన్నారు.


