లోకేశ్వరం: దివ్యాంగులకు చేయూతనిచ్చి అన్ని వి ధాలా అదుకుంటామని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. మండలంలోని గొడిసెరా గ్రామంలో రూ.20 లక్షలతో పాఠశాల ప్రహ రీ, మండల కేంద్రంలోని కేజీబీపాఠశాలలో రూ. 45.12 లక్షలతో నిర్మించే అదనపు తరగతులు, రూ. 10 లక్షలతో నిర్మించే భవిత పాఠశాల భవనానికి గురువారం భూమిపూజ చేశారు. దివ్యాంగులకు 4 వీల్ చైర్లు, 2 వినికిడి పరికరాలు, ఎలక్ట్రికల్ సామగ్రి ని అందజేశారు. కేజీబీవీ పాఠశాలలో సమస్యలు పరిష్కారిస్తామన్నారు. పిప్రి ఎత్తిపోతల పథకంను త్వరగా పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరంది స్తామని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మండల కన్వీనర్ బోడికే సాయన్న, మండల విద్యాధికారి చంద్రకాంత్, గొడిసెరా పాఠశాల హెచ్‌ఎం రవి, కేజీబీవీ ప్రిన్సిపాల్ అనసూయ, భవిత ఇన్‌చార్జి సంతోష్, లోకేశ్వరం సర్పంచ్ దర్వాడి కపిల్, కిష్టాపూర్ సర్పంచ్ భోజన్న, నాయకులు పాల్గొన్నారు.


