మహిళ ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

మహిళ ఆత్మహత్యాయత్నం

Jul 17 2026 3:46 AM | Updated on Jul 17 2026 3:46 AM

బాసర: నిర్మల్‌ పట్టణంలోని రాంనగర్‌కు చెందిన ఉమాబాయి భర్తతో జరిగిన గొడవ కారణంగా ఇద్దరు పిల్లలతో కలిసి గురువారం బాసర గోదావరినదిలో దూకేందుకు యత్నించింది. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది గమనించి వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇప్పించి అప్పగించినట్లు ఎస్‌హెచ్‌వో సీఐ దీపక్‌ తెలిపారు.

ముగ్గురి బైండోవర్‌

భైంసారూరల్‌: దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో మండలంలోని తిమ్మాపూర్‌లో స్థానికులు ఐక్యంగా గస్తీ నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో బుధవారం రాత్రి ముగ్గురు వ్యక్తులు అనుమానస్పందంగా కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై సుప్రియ గ్రామానికి చేరుకుని అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement