సమస్యల పరిష్కారానికి కృషి చేద్దాం | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి కృషి చేద్దాం

Jul 17 2026 3:46 AM | Updated on Jul 17 2026 3:46 AM

ఇంద్రవెల్లి: ఆదివాసీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేద్దామని రాజ్‌గోండ్‌ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎంపీ సోయం బాపూరావ్‌ పేర్కొన్నారు. గురువారం కేస్లాపూర్‌ నాగోబా దర్బార్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన రాయిసెంటర్‌ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాయిసెంటర్‌ సార్‌మేడిలు, ఆయా గ్రామాల పటేళ్లతో సమస్యలపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీల న్యాయమైన డిమాండ్లు, సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్‌గోండ్‌ మహాసభ జాతీయ ఉపాధ్యక్షులు సిడాం ఆర్జు, రాజ్‌గోండ్‌ సేవ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగం విషంరావ్‌, ఆదిలాబాద్‌ జిల్లా మేడి తొడసం అమృత్‌రావ్‌, కుమురం భీం జిల్లా మేడి కుర్సేంగ మోతీరాం, రాయిసెంటర్‌ సార్‌మేడిలు మెస్రం వెంకట్‌రావ్‌, కొట్నాక్‌ పాండురంగ్‌, మెస్రం ఆనంద్‌రావ్‌, నాగ్‌నాథ్‌, సిడాం తిరుపతి, మడావి నర్సింగ్‌రావ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement