మధ్యాహ్నం.. చద్దన్నం! | - | Sakshi
Sakshi News home page

మధ్యాహ్నం.. చద్దన్నం!

Jul 16 2026 5:42 AM | Updated on Jul 16 2026 5:42 AM

● ప్రతి పనికీ డబ్బులు వసూలు ● పైసలిస్తేనే కదులుతుంది ఫైలు ● పట్టుబడుతున్నా మారని తీరు గురువారం శ్రీ 16 శ్రీ జూలై శ్రీ 2026

న్యూస్‌రీల్‌

ముధోల్‌ మండల కేంద్రంలోని విఠోలి సమీపాన బోరున్న ఓ పెద్ద రైతు బుధవారం తన పొలంలో వరి నాటు వేయించాడు. నాటు వేసేందుకు వచ్చిన కూలీలు మధ్యాహ్నం కాగానే ఇలా అంతా పక్కనే ఉన్న రోడ్డుపైకి వచ్చారు. అంతా ఒక్కచోట కూర్చుని చద్దన్నం తింటూ కబుర్లు చెప్పుకొంటూ కనిపించారు. శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకగా నిలిచే ఈ చిత్రం ‘సాక్షి’ కెమెరాకు చిక్కింది. – ముధోల్‌

చాలాశాఖల్లో పెరిగిన అవినీతి

7

నిర్మల్‌

పర్యావరణాన్ని పరిరక్షించాలి

భైంసారూరల్‌: పర్యావరణాన్ని పరిరక్షించాలని ఎస్పీ జానకిషర్మిల పేర్కొన్నారు. వనమహోత్సవంలో భాగంగా బుధవారం భైంసారూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో విద్యార్థినులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి చెట్టుగా ఎదిగే దాకా బాధ్యతగా సంరక్షించాలని సూచించారు. భైంసా ఏఎస్పీ సాయికిరణ్‌, పట్టణ, రూరల్‌, ముధోల్‌ సీఐలు సాయికుమార్‌, ప్రవీణ్‌కుమార్‌, రవీందర్‌నాయక్‌, ఎస్సైలు సుప్రియ, అశోక్‌, జుబేర్‌, కేజీబీవీ ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

నిర్మల్‌: ప్రభుత్వ ఉద్యోగం ప్రజాసేవ కోసం. ఇందుకు రూ.వేలు, రూ.లక్షల్లో వేతనాలు వస్తున్నా.. చాలామంది అధికారులు తమ విధిని అక్రమార్జనకు వేదికగా మార్చుకుంటున్నారు. పక్క జిల్లాల్లో అక్రమార్కులు పట్టుబడుతు న్నా.. కేసుల్లో ఇరుక్కుని జైలుకు వె ళ్తున్నా.. జిల్లాలోని కొందరు అ క్రమార్జనను ఆపడం లేదు. చా లామంది అధికారులు, ఉద్యోగులు, చివరకు కింది స్థాయి సిబ్బంది కూడా ప్రతి పనికీ ఎంతో కొంత ముట్ట జెప్పందే చేయడం లేదు. వారి ఆదా యానికి, కూడబెట్టే ఆస్తులకు ఏ మాత్రం సంబంధం ఉండటం లేదు. వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్ల బిల్లుల్లో వాటాల నుంచి చివరకు తరగతిలో పాఠా లు బోధించే ఉపాధ్యాయుల దాకా అవినీతికి పాల్పడుతుండటం విస్తుగొల్పుతోంది.

చిన్నపనికి కూడా పైసలే..

భర్త చనిపోయిన తర్వాత న్యాయబద్ధంగా భార్య పే రిట పంటభూమిని విరాసత్‌ చేయాలి. ఇందుకు ఎకరాకు, ఏరియాను బట్టి కొంతమొత్తంలో మీసేవలో చలాన్‌ కడితే సరిపోతుంది. కానీ.. క్షేత్రస్థాయి పరి శీలనకు వెళ్లే రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌(ఆర్‌ఐ) పరిస్థితిని బట్టి రూ.5వేల నుంచి రూ.10వేల వరకు తీసుకుంటున్నారు. కొన్ని మండలాల్లో ధరణి ఆపరేటర్‌, తహసీల్దార్‌ కలిసి ఎంత తక్కువ అన్నా రూ.3వేల వరకు తీసుకుంటున్నట్లు ఫిర్యాదులున్నాయి. డబ్బులివ్వకపోతే ఆ విరాసత్‌లో ఒకదాని వెనుక ఒకటి కొ ర్రీలు పెడుతూనే ఉంటారు. ఇదంటే భూమి పంచా యితీ. చివరకు చదువుకునే పిల్లలకు ధ్రువపత్రాలు

ఇవ్వడానికీ డబ్బులివ్వాల్సిందే. జిల్లాలోని అన్ని మండల రెవెన్యూ కార్యాలయాల్లో కాంట్రాక్ట్‌, ప్రైవే ట్‌ చిరుద్యోగులతో ఈ వసూళ్లు చేయిస్తున్నారు. జిల్లాలో గతంలో ల్యాండ్‌ సర్వే, మున్సిపల్‌, రిజిస్ట్రేషన్‌ శాఖల్లో ఏసీబీకి చిక్కిన కేసులన్నింటిలో ఇలా ప్రైవేట్‌ వ్యక్తుల ద్వారానే వసూళ్లకు పాల్పడ్డారు.

ఫిర్యాదులున్నా స్పందన శూన్యం

ప్రభుత్వ కార్యాలయాల్లో చిన్నచిన్న పనులు కూడా లంచం లేకుండా జరగడం లేదన్న అభిప్రాయం ప్ర జల్లో పెరుగుతోంది. ఆదాయం, భూములు, నిర్మాణాలు, సంక్షేమ పథకాలు, అనుమతులు తదితర అనేక సేవలకు సంబంధించి దరఖాస్తుదారులు అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అధికారిక ఫీజులతో పాటు ఈ అక్రమ వసూళ్లు సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. భరించలేని పరిస్థితుల్లో పైఅధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.

బిల్లలిస్తేనే బిల్లులు..!

జిల్లాలో గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తనకున్న కొద్దిపాటి రాజకీయ సంబంధాలు, ఆర్థిక సహకారంతో ఓ శాఖలో కాంట్రాక్ట్‌ పనులు చేశాడు. సదరు పనులు పూర్తయి, ఏడాది దాటినా బిల్లులు మాత్రం రాలేదు. సంబంధిత అధికారులను అడిగితే.. ‘నువ్వు కాంట్రాక్ట్‌ పనులకు కొత్త కదా..!’ అంటూ ఓ వెకిలి నవ్వు నవ్వారు. బిల్లులు రావాలంటే కింది నుంచి మీది దాకా డబ్బులు ఇవ్వాల్సిందే అన్న విషయం ఆ యువకుడికి స్పష్టమైంది. ఇలా.. ఆ ఒక్కశాఖలోనే కాదు.. కాంట్రాక్టర్లకు పనులిచ్చే అన్ని శాఖల్లో ఇదే పరిస్థితి. ‘అన్న.. సార్లందరికీ పైసలిచ్చినంక మేం పక్కాగా పనులు యాడికెళ్లి చేయాల్నె. అందుకే ఏసిన రోడ్లు, కట్టిన మోరీలు, బడుల బిల్డింగులు, పైప్‌లైన్లు అన్నీ.. కొన్ని నెలలకే పనికి రాకుండా పోతున్నయ్‌..’ అని ఓ యువ కాంట్రాక్టర్‌ ఆవేదన వ్యక్తంచేశాడు.

కళ్లముందే ఉల్లంఘనలు

జిల్లాలో అనుమతులు లేకుండా నిర్మాణాలు, ఇసుక అక్రమ రవాణా, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు, పర్యావరణ ఉల్లంఘనలు తదితర అనేక అంశాలు బహిరంగంగానే కనిపిస్తున్నా.. సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవడం లేదు. అధికారులు కూడా వాటాలు ఆశిస్తుండటం, పట్టించుకోక పోవడంతో అక్రమాలకు పాల్ప డుతున్న వారికి మరింత ధైర్యన్నిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement