లక్ష్మణచాంద: కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని రాచాపూర్ గ్రామంలో రూ.10లక్షల ఈజీఎస్ నిధులతో నిర్మించిన ఎస్‌హెచ్‌జీ (వీవో) భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. మండల కేంద్రంలో రూ.30 లక్షలతో చేపట్టిన గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. వ్యవసాయరంగ అభివృద్ధి, రైతుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. సర్పంచులు ముత్యం, ఓస కవిత రాజు, తహసీల్దార్ సరిత, ఎంపీడీవో రమాకాంత్, ఏవో నాగరాజు, ఎంఈవో రాజునాయక్, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గంగామణి, బీజేపీ మండలాధ్యక్షుడు చిన్నయ్య, నాయకులు రమేశ్, ముత్యంరెడ్డి, రవి, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.
అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష
మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో వివిధ శా ఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే స మీక్ష నిర్వహించారు. ఒక్కో గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులతో విడివిడిగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మల్లాపూర్, పార్‌పెల్లి, బాబాపూర్ ప్రభు త్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను కేటాయించాలని ఎంఈవోను ఆదేశించారు. పొట్టపెల్లి (కే), చింతల్‌చాంద గ్రామాల్లోని పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు. విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని అధికారి శ్రీనివాస్‌ను, గ్రామాల్లో చేపట్టాల్సి న అభివృద్ధి పనుల కోసం ప్రతిపాదనలు పంపాలని ఏపీవో ప్రమీలను ఆదేశించారు. ప్రతీనెల సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


