● సన్నాలు సాగుచేసే రైతులు ఆన్‌లైన్‌ చేసుకోవాలి ● ఈనెలాఖరు వరకు అవకాశం | - | Sakshi
Sakshi News home page

● సన్నాలు సాగుచేసే రైతులు ఆన్‌లైన్‌ చేసుకోవాలి ● ఈనెలాఖరు వరకు అవకాశం

Jul 15 2026 12:05 AM | Updated on Jul 15 2026 12:05 AM

● సన్నాలు సాగుచేసే రైతులు ఆన్‌లైన్‌ చేసుకోవాలి ● ఈనెలాఖరు వరకు అవకాశం

ఖానాపూర్‌: రాష్ట్ర ప్రభుత్వం సన్నాల వరి సాగును ప్రోత్సహించేందుకు బోనస్‌ పథకాన్ని ప్రకటించింది. ఈ బోనస్‌ పొందాలంటే అర్హులైన రైతులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వం నోటిఫై చేసి న ఏడు రకాల సన్నాల వరి వంగడాల విత్తనాలను కొనుగోలు చేసిన రైతులు సంబంధిత విత్తన విక్ర య డీలర్ల ద్వారా ఆన్‌లైన్‌ నమోదు పూర్తి చేసుకోవా లని అధికారులు సూచించారు. నమోదు గడువు ఈనెల 30 వరకు ఉంది. రైతులు ఆలస్యం చేయవద్దని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.

జిల్లాలో వరిసాగు ఇలా..

జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావడంతో ఏ టా లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. 2025 పంట సంవత్సరంలో వానాకాలం సీజన్‌లో జిల్లాలో మొత్తం 4,37,885.66 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా, అందులో 1,41,392.30 ఎకరాల్లో వరి సాగైంది. కడెం, లోకేశ్వరం మండలాలు వరి సాగులో ముందంజలో ఉన్నాయి. యాసంగి సీజన్‌లో మొత్తం 3,52,678.89 ఎకరాల్లో పంటలు సాగు కాగా, అందులో 1,29,296.43 ఎకరాల్లో వరి పండించారు.

ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి..

ప్రభుత్వం బోనస్‌ ప్రకటించిన బీపీటీ–5204 (సాంబా మసూరి), ఆర్‌ఎన్‌ఆర్‌–15048 (తెలంగాణ సోనా), హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరామ్‌, కెఎన్‌ఎమ్‌–1638, డబ్ల్యూజీఎల్‌–44, జేఎన్‌ఎమ్‌–7715 వరి వంగడాల విత్తనాలను ఫర్టిలైజర్‌ దుకాణాల్లో కొనుగోలు చేసిన రైతులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌ నమోదు చేయించుకోవాలి. రైతులు విత్తనాల కొనుగోలు రసీదు, పట్టాదారు పాస్‌బుక్‌ వివరాలు, మొబైల్‌ నంబర్‌తో సంబంధిత విత్తన విక్రయ దుకాణాలను సంప్రదించి నమోదు పూర్తి చేయాలి. గడువు ముగిసిన తర్వాత నమోదుకు అవకాశం ఉండదు. – జగదీశ్వర్‌, ఏవో, ఖానాపూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement