అర్జీదారులకు అండగా నిలవాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీదారులకు అండగా నిలవాలి

May 26 2026 8:12 AM | Updated on May 26 2026 8:12 AM

● ఎస్పీ జానకీషర్మిల

నిర్మల్‌టౌన్‌: అర్జీదారుల నుంచి వచ్చిన సమస్యను త్వరగా పరిష్కరించి తాము ఉన్నామన్న భరోసా సామాన్యులకు పోలీసులు కల్పించాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు ఎస్పీని కలిసి తమ అర్జీ సమర్పించారు. సమస్య చెప్పుకున్నారు. ఓపికగా విన్న ఎస్పీ వెంటనే సంబంధిత పోలీస్‌ స్టేషన్ల అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. సమస్యలు త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. నాణ్యమైన పోలీసు వ్యవస్థను జిల్లా ప్రజలకు అందించడమే లక్ష్యమన్నారు. పోలీసుల సహాయం కావాలనుకునేవారు ఠాణాలో నిర్భయంగా ఫిర్యాదు చేయాలని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement