ఎంపీడీవో కార్యాలయం తనిఖీ | - | Sakshi
Sakshi News home page

ఎంపీడీవో కార్యాలయం తనిఖీ

May 22 2026 4:46 AM | Updated on May 22 2026 4:46 AM

ఖానాపూర్‌: పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని జెడ్పీ సీఈవో భాగ్యలక్ష్మి గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో నిర్వహిస్తున్న పలు రికార్డులను పరి శీలించారు. వాటి నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ఎంపీడీవో రాధా రాథోడ్‌, ఎంపీవో రత్నాకర్‌రావు, సి బ్బందితో సమావేశమై కార్యాలయ పనితీరు, అభివృద్ధి కార్యక్రమాల అమలు తదితర అంశాలపై చర్చించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సమర్థవంతంగా అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సీసీ వికాస్‌, సిబ్బంది స్వామి, సాగర్‌, లతీఫ్‌, రమేశ్‌ తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement