ఇసుక డంపులు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

ఇసుక డంపులు స్వాధీనం

May 22 2026 4:46 AM | Updated on May 22 2026 4:46 AM

నర్సాపూర్‌ (జి): మండలంలోని అర్లి(కే) సు ద్దవాగు నుంచి రాత్రి వేళ జోరుగా ఇసుక అ క్రమ రవాణా చేస్తున్నారు. స్థానిక శ్మశాన వా టిక పక్కన ఇసుకను డంపు చేసి రాత్రి వేళ ఇ తర ప్రాంతాలకు ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. గ్రామస్తుల సమాచారంతో బుధవారం రాత్రి డీటీ ఏంఎ వాహీద్‌, వీఆర్‌ఏ రఘు, పోలీస్‌ సి బ్బంది వెళ్లి ఇసుక తరలిస్తున్న ఒక ట్రాక్టర్‌ను పట్టుకున్నారు. పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. మైనింగ్‌ ఏఈ కాంబ్లె ఆనంద్‌, ఆర్‌ఐ సుమలత, జీపీవో సుమలత ఇసుక డంపులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement