మామడ: వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చే సుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. గు రువారం మామడ కేజీబీవీలో కొనసాగుతున్న వేస వి శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. క్యాంపులో వి ద్యార్థినులకు నేర్పిస్తున్న నైపుణ్యాలను పరిశీలించా రు. సమ్మర్‌క్యాంపుల ద్వారా డ్యాన్స్, పాటలు, యో గా, పెయింటింగ్, ఆటలు, కంప్యూటర్,, కళలు తది తర అంశాల్లో ఇస్తున్న శిక్షణను వినియోగించుకుని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించా రు. శిక్షణ శిబిరాల్లో నూతన విషయాలు నేర్చుకుని భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని సూచించారు. విద్యార్థినులకు అందిస్తున్న సదుపాయాల గురించి వారినే అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు ఇ బ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యార్థినులకు కలెక్టర్ స్వయంగా బోధించి ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. డీఈవో భోజన్న, తహసీల్దార్ శ్రీనివాస్‌రావు, అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.


