ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు సహకరించాలి

May 22 2026 4:46 AM | Updated on May 22 2026 4:46 AM

భైంసాటౌన్‌: దేశ సమగ్రత కోసం చేపట్టిన ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే రామారావు పటేల్‌ కోరారు. పట్టణంలోని హరియాలి ఫంక్షన్‌ హాల్‌లో ఎస్‌ఐఆర్‌పై గురువా రం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పా ల్గొని మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టి న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ తమ ఓటు ను పరిశీలించుకోవాలని సూచించారు. బోగస్‌ ఓట్ల తొలగింపు, మార్పులు, చేర్పులు పక్కాగా జరిగేలా చూడాల్సిన బాధ్యత కూడా అందరిపై ఉందని పేర్కొన్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర (ఎస్‌ఐఆర్‌) ఇన్‌చార్జి జయశ్రీ 2002 ఓటరు జాబితా ప్రామాణికంగా చేపడుతున్న ఎస్‌ఐఆర్‌ ఉద్దేశాలను వివరించారు. కార్యక్రమంలో సాదుల కృష్ణదాస్‌, రావుల రాంనాథ్‌, సరికొండ దామోదర్‌ తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement