దోమల నియంత్రణకు చర్యలు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

దోమల నియంత్రణకు చర్యలు చేపట్టాలి

May 17 2026 7:20 AM | Updated on May 17 2026 7:20 AM

● డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజేందర్‌

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లాలో దోమల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజేందర్‌ ఆదేశించారు. జాతీయ డెంగీ నివారణ దినం పురస్కరించుకుని బంగల్‌పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం సమావేశం నిర్వహించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ప్రతీ మంగళ, శుక్రవారం డ్రై డే పాటించి దోమలను లార్వా దశలోనే అరికట్టాలన్నారు. డెంగీ లక్షణాలు, వ్యాధి నియంత్రణ, నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంతరం డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా సోమవారం నిర్వహించబోయే మాక్‌ డ్రిల్‌, సిబ్బంది చేపట్టాల్సిన బాధ్యతలు గురించి వివరించారు. కార్యక్రమంలో నిర్వహణ అధికారులు డాక్టర్‌ పవన్‌, రాకేశ్‌, డిప్యూటీ జిల్లా విస్తరణ, మీడియా అధికారి బారె రవీందర్‌, శిరీష, మనీష, మౌనిక, డీపీవో రామచందర్‌, ఆరోగ్య పర్యవేక్షక అధికారులు, ఆరోగ్య సహాయకులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement