తానూరు: సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని భైంసా ఏఎస్పీ సాయికిరణ్ సూచించారు. తానూరు పోలీస్‌స్టేషన్‌ను శనివారం తనిఖీ చేశారు. ఇటీవల నమోదైన కేసుల వివరాలు సీఐ రవీందర్ నాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. విధులు సమర్థవంతంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. పెండింగ్‌లో ఉన్న కేసులు త్వరగా పరిష్కరించాలన్నారు. స్టేషన్‌లో ఉన్న సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. రాత్రి వేళల్లో మమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించాలని తెలిపారు. శిథిలావస్థకు చేరిన పాత పోలీస్ స్టేషన్ భవనాన్ని పరిశీలించారు.


