నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

May 17 2026 7:20 AM | Updated on May 17 2026 7:20 AM

8లోu ఆదివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2026

న్యూస్‌రీల్‌

ఆర్జీయూకేటీలో గ్రంథాలయ దినోత్సవం

బాసర ఆర్జీయూకేటీలో శనివారం గ్రంథాలయ దినోత్సవం నిర్వహించారు. రఇంజినీరింగ్‌, సైన్స్‌, సాహిత్య విషయాలకు సంబంధించి పుస్తకాల ప్రదర్శన ఏర్పాటు చేశారు.

అంతటా సోలార్‌.. అన్నీ ఈవీలే..

జిల్లాకేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆమెడ కిషన్‌ సైతం తనవంతు బాధ్యత అన్నట్లుగా విద్యుత్‌, ఇంధన పొదుపు చేస్తున్నారు. తమ ఇంటితోపాటు హోటళ్లు, లాడ్జీలు కలిపి దాదాపు 100 కిలోవాట్‌ల సోలార్‌ విద్యుత్‌ పెట్టించారు. ఇందుకు దాదాపు రూ.40 లక్షల వరకు ఖర్చు చేశారు. తాను రోజు వాడే కారుతోపాటు ఇంట్లో, దుకాణాల్లో వినియోగించే కార్లు, స్కూటర్లు అన్నీ ఎలక్ట్రిక్‌ వాహనాలే కావడం గమనార్హం.

పెట్రోల్‌, కరెంట్‌.. పనే లేదు..

జిల్లాకేంద్రంలోని శాంతినగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రజినీకాంత్‌ దాదాపు ఏడాదిగా పెట్రోల్‌ బంక్‌ వైపు వెళ్లడం లేదు. కరెంటు బిల్లూ కట్టడం లేదు. ఎందుకంటే.. ఆయనకు ఆ రెండింటి అవసరమే లేదు. కేంద్ర ప్రభుత్వ ‘సూర్యఘర్‌’ స్కీమ్‌ ద్వారా ఇంటిపైన 5 కిలోవాట్‌ల సోలార్‌ విద్యుత్‌ పెట్టించారు. ఇందుకు రూ.3.20 లక్షలు ఖర్చు పెట్టాడు. ఈ మొత్తాన్ని సున్న వడ్డీ కింద లోన్‌ రూపంలో ఇచ్చారు. ఇందులో మళ్లీ రూ.78 వేల సబ్సిడీ కూడా వచ్చింది. దీంతో కరెంట్‌బిల్‌ బాధ తప్పింది.పైగా మిగులు విద్యుత్‌ను ఉల్టా విక్రయించుకునే అవకాశమూ ఉంది. ఇక.. విధులకు, ఎటైనా ఊళ్లకు వెళ్లడానికి ఎలక్ట్రిక్‌ కారు, ఊళ్లో తిరగడానికి ఎలక్ట్రిక్‌ స్కూటీ తీసుకున్నారు. ఇంట్లోనే సోలార్‌ విద్యుత్‌ ద్వారా వీటిని ఉచితంగా చార్జింగ్‌ చేసుకుంటున్నారు. దీంతో పెట్రోల్‌తో కూడా పనిలేకుండా పోయింది. అంతే కాదండోయ్‌.. ఇంట్లో కూడా గ్యాస్‌ వాడకాన్ని తగ్గించడానికి అప్పుడప్పుడు సోలార్‌ విద్యుత్‌తోనే వంట చేసుకునేలా ఇండక్షన్‌ స్టవ్‌నూ తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement