పొదుపు మంత్రం | - | Sakshi
Sakshi News home page

పొదుపు మంత్రం

May 17 2026 7:20 AM | Updated on May 17 2026 7:20 AM

ఇంధనం, విద్యుత్‌ ఆదా చేస్తున్న జిల్లా వాసులు ప్రధాని మోదీ పిలుపుతో మరింత మార్పు

‘సూర్య ఘర్‌’పై చాలామంది ఆసక్తి

నిర్మల్‌: ‘అమెరికా–ఇరాన్‌ యుద్ధం కారణంగా ప్రపంచమే మారిపోతోంది. ఇక మనమూ మారాలి..’ అంటూ ఇటీవల హైదరాబాద్‌ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పొదుపు సూచనలు చేశారు. మొదట్లో వాటిని లైట్‌గా తీసుకున్న జిల్లా వాసులు రోజురోజుకూ పెరుగుతున్న ఇంధన ధరలు, భారీగా వస్తున్న విద్యుత్‌ బిల్లులతో క్రమంగా ‘పొదుపు’ మంత్రాన్ని పఠిస్తూ.. నిత్యజీవితంలో పాటిస్తున్నారు. ప్రధాని చెప్పిన పొదుపు సూత్రాలపై అవగాహన పెంచుకోవడమే కాకుండా ఆచరణలో పెట్టే విధంగా అడుగులు వేస్తున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు సైతం ప్రధాని అడుగుజాడల్లో నడిచే ప్రయత్నం చేస్తున్నారు.

పెట్రోల్‌ బంక్‌ వైపు వద్దంటూ..

ఇరాన్‌–అమెరికా యుద్ధం తీవ్రంగా ఉన్న సమయంలో బంక్‌లు మూసి ఉండటం, తెరిచి ఉన్నా వాహనాలు భారీగా బారులు తీరి ఉండటం చాలామంది వాహనదారులను ఇబ్బంది పెట్టింది. అదే సమయంలో ఈవీ స్కూటర్లు, బైకులు ఉన్నవాళ్లు కనీసం బంకుల వైపు కూడా చూడకుండా హాయిగా వెళ్లిపోయారు. తాజాగా పెట్రోల్‌ లీటర్‌కు రూ.3 పెరిగింది. మున్ముందు ఇంకా ఎంత పెరిగే అవకాశం ఉంది. ఈక్రమంలో ప్రధాని సూచించిన ఎలక్ట్రిక్‌ వాహనాలు(ఈవీ)బెస్ట్‌ అన్న చర్చ అంతటా సాగుతోంది.

బిల్లుల బాధ లేదు..

మొదట్లో కొంత ఖర్చయినా జీవితాంతం కరెంటు బిల్లుల బాధ తప్పాలంటే ‘పీఎం సూర్యఘర్‌ యోజన’కు జైకొట్టాల్సిందే. ఈ పథకానికి సున్నా వడ్డీతోపాటు సబ్సిడీ కూడా ఇస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాకేంద్రంతో పాటు భైంసా, ఖానాపూర్‌ వంటి పట్టణాలు, మండలకేంద్రాల్లో శరవేగంగా సోలార్‌ విద్యుత్‌ను పెట్టిస్తున్నారు. విద్యుత్‌ ఉచితంగా వస్తుండటంతోపాటు మిగులు కరెంటును విక్రయించుకునే అవకాశమూ ఉంటుంది. దీనికితోడు ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఇంట్లో ఇండక్షన్‌ స్టవ్‌లను వాడటం వల్ల అటు పెట్రోల్‌, ఇటు వంటగ్యాస్‌ సమస్య ఉండదు.

ఎమ్మెల్యేలు సైతం..

తాను చెప్పడమే కాకుండా ఆచరించి చూపుతున్న ప్రధాని బాటలోనే జిల్లా ఎమ్మెల్యేలూ నడుస్తున్నా రు. నిర్మల్‌, ముధోల్‌ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, రామారావుపటేల్‌ బయటకు వెళ్తే వారి వాహనంతోపాటు మరోరెండు వాహనాలతో కాన్వాయ్‌ ఉండేది. ఇటీవల ఒకే వాహనంలో భద్రతా సి బ్బంది, నాయకులతో కలిసి కార్యక్రమాలకు వెళ్తున్నారు. పలు కార్యక్రమాలకు శుక్రవారం ఎంపీ నగే శ్‌, ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి ఒకే కారులో ప్రయాణించారు. భైంసాలోని తమ నివాసంపై రామారావుపటేల్‌ సోలార్‌ విద్యుత్‌ ఏర్పాటు చేయిస్తున్నారు. పొదుపు, ఇంధన ఆదాపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో ఆచరణలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుండటం విశేషం.

కాన్వాయ్‌ తగ్గించిన ప్రజాప్రతినిధులు

Advertisement
 
Advertisement
Advertisement