ముధోల్: మండలంలోని చించాల గ్రామంలో సఖీ సెంటర్, డీఎల్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో విక్టిమ్స్ ఆఫ్ ట్రాఫికింగ్, కమర్షియల్ సెక్సుయల్ ఎక్స్‌పోలిటేషన్ అనే అంశంౖపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవల సంస్థ సీనియర్ సివిల్ జడ్జి రాధిక హాజరై మాట్లాడారు. చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. బాల్యం చదువుకే పరిమితం కావాలని, పిల్లలను పనిలో పెట్టుకోవడం నేరమని స్పష్టం చేశారు. ఫోక్సో చట్టం, పిల్లలపై జరిగే లైంగింక వేధింపుల నుంచి రక్షణ కల్పించే ఈ చట్టం గురించి క్షుణ్ణంగా వివరించారు. బాల్య వివాహాలను అరికట్టాలన్నారు. అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం చేయాలని సూచించారు. గ్రామంలో యువత మత్తు పదార్థాలకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకోవద్దన్నారు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ సర్వేష్, ఎస్సై బిట్లా పెర్సిస్, సఖీ కేంద్రం సీఏ స్వాతిరాణి, డీఎంసీడబ్ల్యూ సవిత, కవిత, లావణ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.


