అక్కలా కలిసిపోయి.. అన్నీ వివరించి.. | - | Sakshi
Sakshi News home page

అక్కలా కలిసిపోయి.. అన్నీ వివరించి..

May 15 2026 10:02 AM | Updated on May 15 2026 10:02 AM

సైబర్‌ నేరాలు, మహిళల భద్రతపై ఉపాధి కూలీలకు అవగాహన కూలీలతో ఎస్పీ జానకీషర్మిల మాటామంతి

కడెం: రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలో ఎస్పీ జానకీషర్మిల పోలీస్‌ అక్క కార్యక్రమాన్ని ప్రారంభించా రు. మహిళా పోలీసులకు వివిధ బాధ్యతలు అప్పగించి రాష్ట్రస్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. తాజాగా ఎస్పీ పోలీస్‌ అక్కగా జిల్లాలోని కడెం మండలం పెద్ద బెల్లాల్‌ సమీపంలో గురువారం పర్యటించారు. అక్కలా మహిళా కూలీలతో కలిసిపోయారు. అవగాహన సదస్సు నిర్వహించారు. సాధారణ మహిళగా కింద కూర్చుని, మహిళలతో కలిసి చర్చించారు. మహిళల భద్రత, సైబర్‌ నేరాలు, మాదక ద్రవ్యాలపై సలహాలు ఇచ్చి, ప్రజల మనసులు గెలిచారు. తల్లిదండ్రులు పిల్లలకు మార్గదర్శకత్వం చేయాలని, సైబర్‌ మోసాలకు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరారు. రోడ్డుభద్రత, మహిళల రక్షణపై దృష్టి పెట్టారు.

ప్రజల స్పందన

ఎస్పీ స్వయంగా వచ్చి మాట్లాడినందుకు గ్రామస్తులు, మహిళలు, ఉపాధి కూలీలు సంతోషం వ్యక్తం చేశారు. ఆమెతో ఆప్యాయంగా ముచ్చటించి, తమ సమస్యలు చెప్పారు. అనంతరం సెల్ఫీలు తీసుకుని ఆనందపడ్డారు. ఈ కార్యక్రమం ఎస్పీ గుర్తింపును మరింత పెంచింది. కార్యక్రమంలో నిర్మల్‌ డీఎస్పీ శ్రీనివాస్‌, డీఆర్డీవో విజయలక్ష్మి, సీఐ అజయ్‌, ఎ స్సైలు సాయికిరణ్‌, సాయికుమార్‌, రాహుల్‌, హ న్మాండ్లు, సైబర్‌ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటరమణ, షీ టీమ్‌ ఎస్సై సుమాంజలి, సర్పంచ్‌ ఈదుల తిరుప తి, ఉప సర్పంచ్‌ రమ్యరవీందర్‌, ఏపీవో జయదేవ్‌, కార్యదర్సి రాజశేఖర్‌, టీఏలు కాంతరావు, శ్రీనివా స్‌, గణేశ్‌, ఫీల్డ్‌ ఆసిస్టెంట్లు రాజలింగు, ఉత్తర్‌, షీటీ మ్‌ బృందం, గ్రామస్తులు, కూలీలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement