మళ్లీ ఎల్‌ఆర్‌ఎస్‌ | - | Sakshi
Sakshi News home page

మళ్లీ ఎల్‌ఆర్‌ఎస్‌

May 5 2026 7:20 AM | Updated on May 5 2026 7:20 AM

మంగళవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2026 10లోu

న్యూస్‌రీల్‌

ప్లాట్ల క్రమబద్ధీకరణ ఫీజుపై 25 శాతం రాయితీ జిల్లా వ్యాప్తంగా 37,939 మందికి ఫీజు చెల్లింపు సమాచారం ఇప్పటి వరకు చెల్లించింది 10,027 ప్లాట్లకే.. ఇంకా చెల్లించాల్సింది 29,872 మంది జూలై 31 వరకు అవకాశం

నిర్మల్‌

పొల్లుగూడలో పెర్సపేన్‌ ఉత్సవాలు

ఇంద్రవెల్లి మండలం పొల్లుగూడలో జుగ్నాక్‌ వంశీయుల పెర్సపేన్‌కు పూజలు చేశారు. జుగ్నాక్‌ వంశంలోని కోడళ్లకు భేటింగ్‌ నిర్వహించారు.

నిర్మల్‌ ఎస్డీపీవోగా శ్రీనివాస్‌

నిర్మల్‌టౌన్‌: నిర్మల్‌ సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారిగా పి.శ్రీనివాస్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ జానకీషర్మిలను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ.. శాంతి భద్రతల పరిరక్షణకు సమర్థవంతంగా పని చేయాలని ఎస్పీ సూచించారు. అలాగే నేరాల నియంత్రణ, ట్రాఫిక్‌ నిర్వహణ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు.

నిర్మల్‌చైన్‌గేట్‌: ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. ఈ క్రమంలో ఎల్‌ఆర్‌ఎస్‌ కింద ప్లాట్లు క్రమబద్ధీకరణ చేసుకునే వారికి మరోమారు రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. 2020లో ఎల్‌ఆర్‌ఎస్‌ (లే ఆవుట్ల క్రమబద్ధీకరణ పథకం) దరఖాస్తు చేసుకున్న ప్లాట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను రాష్ట్ర పురపాలక శాఖ ప్రారంభించింది. 2020లో చేసిన దరఖాస్తు దారుల్లో పలువురు ఇంటి నిర్మాణం, మరికొందరు ప్లాట్లను విక్రయించారు. గతంలో ప్రభుత్వం రాయితీ ప్రకటిస్తే అంతంతమాత్రంగానే ముందుకు వచ్చారు. మరోసారి ఈ ఏడాది జూలై 31వ తేదీ వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లించేవారికి 25 శాతం రాయితీ ప్రకటించింది. జిల్లా వ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లించాలని నోటీసులు జారీచేసిన వారిలో 29,872 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

ఫోన్లకు సమాచారం..

జిల్లా వ్యాప్తంగా 44,602 మంది దరఖాస్తు చేయగా 37,939 ప్లాట్లకు ఆటోమెటిక్‌ ఫీజు చెల్లింపు సమాచారం వారి ఫోన్లకు పంపించారు. ఇప్పటి వరకు 10,027 దరఖాస్తు దారులు మాత్రమే డబ్బు చెల్లించారు. గతేడాది ఫిబ్రవరి 20 నుంచి మార్చి 31వ తే దీ వరకు ఫీజు చెల్లింపులో 25 శాతం రాయితీని ప్రకటించిన విషయం తెలిసిందే. మరోమారు మే 1 నుంచి జూలై 31వ తేదీ వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చె ల్లించిన వారికి రాయితీని ప్రభుత్వం ప్రకటించింది.

ఆశించింది రూ.16 కోట్లు

ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు రూపేణా నిర్మల్‌, ఖానాపూర్‌, భైంసా మున్సిపాలిటీకి రూ.13 నుంచి రూ.14 కోట్లు, జిల్లాలోని 18 మండలాల పరిధిలో గ్రా మాల నుంచి రూ.4 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని అధికార యంత్రాంగం ఆశించింది. అయితే ప్లాట్ల యజ మానుల నుంచి సరైన స్పందన లేని కారణంగా వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ప్లాట్ల యజ మానుల చెల్లింపుతో రూ.11.50 కోట్లు మాత్రమే వచ్చాయి.

హోంగార్డ్‌ కుటుంబానికి ఆర్థిక సహాయం

నిర్మల్‌టౌన్‌: బాసర పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్‌ వెంకటరమణ కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బాధిత కుటుంబానికి యాక్సిడెంట్‌ బెనిఫిట్‌ స్కీం కింద మంజూరైన రూ.30 లక్షల చెక్కును ఎస్పీ జానకీషర్మిల జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం వెంకటరమణ కుటుంబ సభ్యులకు అందించారు.

మున్సిపాలిటీల వారీగా దరఖాస్తుల వివరాలు

మున్సిపాలిటీ దరఖాస్తులు అనుమతి ఫీజు చెల్లించినవి చెల్లించాల్సినవి పొందినవి

నిర్మల్‌ 15,550 12,987 3,565 9,422

భైంసా 9,058 7,345 1,062 6,283

ఖానాపూర్‌ 1,928 1,518 210 1,308

పదేపదే గడువు పెంచినా..

ఎల్‌ఆర్‌ఎస్‌కు 25 శాతం ఫీజు రాయితీ ప్రకటించిన ప్రభుత్వం తొలుత గతేడాది మార్చి 31వ తేదీ వరకు గడువు విధించగా ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దీంతో మరోసారి ఏప్రిల్‌ 30 వరకు గడువు పొడిగించింది. అయినా నామమాత్రంగానే స్పందన వచ్చింది. దీంతో మే 3వ తేదీ వరకు మళ్లీ గడువు పెంచినా ఆశించిన స్థాయిలో చెల్లింపులు లేవు. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ మే నెల 31వ తేదీ వరకు చెల్లింపు గడువు పెంచుతూ మే 12న ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజు అధికంగా ఉందని కొందరు, ఆర్థిక పరిస్థితుల కారణంతో ఇంకొందరు, లేదా ఫీజు ఇప్పుడెందుకు, తర్వాత చూద్దాంలే అని మరికొందరు అర్జీదారులు ముందుకు రాకపోవడం ఆదాయం తగ్గడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

వివరాలు..

మొత్తం దరఖాస్తులు 44,602

నగదు చెల్లింపుకు అర్హులు 37,939

నగదు చెల్లించిన వారు 10,027

ఇంకా చెల్లించాల్సిన వారు 29,872

అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి

నిర్మల్‌టౌన్‌: సమస్యలతో అర్జీ చేతపట్టుకుని ఠాణాకు వచ్చేవారి సమస్యలు పరిష్కరించాలని, సామాన్యులకు అండగా ఉండాలని ఎస్పీ జానకీషర్మిల పోలీసులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలు తెలుసుకుని సంబంధిత పోలీస్‌ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. నాణ్యమైన పోలీసు వ్యవస్థను జిల్లా ప్రజలకు అందించాలని సూచించారు. పోలీసుల సహాయం కావాలనుకునేవారు ఠాణాలో నిర్భయంగా ఫిర్యాదు చేయాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనబడినా, సంఘ వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయని తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

మండలాల వారీగా..

మండలం దరఖాస్తులు అనుమతి ఫీజు చెల్లించినవి చెల్లించాల్సినవి

పొందినవి

బాసర 2,607 2,384 547 1,837

భైంసా 1,581 1,415 227 1,188

దస్తురాబాద్‌ 06 06 06 0

దిలావర్‌పూర్‌ 174 148 19 129

కడెం 77 66 09 57

ఖానాపూర్‌ 1,650 1,574 278 1,296

కుభీర్‌ 622 302 20 281

కుంటాల 388 350 74 276

లక్ష్మణచాంద 269 253 28 225

లోకేశ్వరం 346 294 50 244

మామడ 59 58 05 53

ముధోల్‌ 650 559 79 480

నర్సాపూర్‌(జి) 218 190 53 137

నిర్మల్‌ రూరల్‌ 5,607 5,128 1,158 3,970

పెంబి 65 40 04 36

సారంగాపూర్‌ 1,991 1,889 385 1,504

సోన్‌ 1,588 1,299 270 1,029

తానూర్‌ 167 135 24 111

Advertisement
 
Advertisement
Advertisement