నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Apr 29 2026 8:42 AM | Updated on Apr 29 2026 8:42 AM

బుధవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

న్యూస్‌రీల్‌

బాసరలో భూములున్న ఫలితంలేదు ప్రభుత్వ భూములపై సర్వే చేశారు పరిశ్రమల ఏర్పాటును మరిచారు ప్రోత్సాహం దిశగా దృష్టిపెట్టాలి

జన గణన జాబితాలో నమోదు చేసుకోవాలి

‘నెట్టింట్లో’ కథలు

సెలవుల్లో విద్యార్థులు ఇంటివద్ద మొబైల్‌ ఫోన్లలో పనికిరాని గేమ్స్‌, సినిమాలతో సమయం వృథా చేస్తారు. అయితే ఆన్‌లైన్‌లో విజ్ఞానం పెంచే పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.

ఇంటర్‌ బోర్డు కార్యదర్శికి వినతి

లోకేశ్వరం: ఇటీవల తెలంగాణ ఇంటర్‌ బోర్డు కార్యదర్శిగా నియమితులైన అభిలాష అభినవ్‌ను నిర్మల్‌ జిల్లా 711 సంఘం అధ్యక్షుడు కర్గం వినోద్‌కుమార్‌ మంగళవారం మద్యాపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని కార్యాలయంలో కలిసి ఇంటర్‌ విద్యావ్యవస్థలో నెల కొన్న సమస్యలను వారి దృషికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వారి వెంట సంఘం ప్రధాన కార్యదర్శి రవీందర్‌, ఉపాధ్యక్షుడు పురుషోత్తం ఉన్నారు.

భైంసా: జిల్లాల పునర్విభజనతో నిర్మల్‌ జిల్లాగా ఏర్పడింది. దీంతో పాలన చేరువవుతుందని, అభివృద్ధి వేగంగా జరుగుతుందని, పరిశ్రమలు వస్తాయని జిల్లా ప్రజలు ఆశించారు. జిల్లా ఏర్పడి దశాబ్దం అయినా కొత్తగా కలెక్టరేట్‌ మినహా జిల్లాకు ఒరిగింది ఏమీ లేదని జిల్లా వాసుల్లో నైరాశ్యం నెలకొంది. గత ప్రభుత్వం పారిశ్రామిక సామర్థ్యాన్ని గుర్తించిన అప్పటి ప్రభుత్వం ఇక్కడ సెజ్‌ (స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌) ఏర్పాటు, సూక్ష్మ, మధ్యస్త పరిశ్రమల పెంపుదల వంటి ప్రణాళికలు రూపొందించింది. కానీ నేటికీ అవి ప్రణాళిక దాటలేదు. బాసర మండలంలో సుమారు 800 ఎకరాలకు పైగా ప్రభుత్వానికి చెందిన భూములు గుర్తించి, పెద్ద పరిశ్రమల కోసం వాటిని ఇస్తున్నట్లు రెవెన్యూ శాఖ సూచించింది. 2020లో జిల్లా యంత్రాంగం, పరిశ్రమల శాఖ స్వీయంగా సర్వే నిర్వహించి బాసరలో సెజ్‌ ఏర్పాటు అవకాశాలపై చర్చలు జరిపినా, దానికి అనుగుణంగా ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదు. ఈ విషయంలో గత ప్రభుత్వంలో అనేకసార్లు సమావేశాలు, ప్రకటనలు జరిగినప్పటికీ ఇప్పటి వరకు జిల్లాలో పెద్ద పరిశ్రమల ఏర్పాటుకు ముందడుగు పడలేదు.

సోలార్‌ ప్లాంట్లు...

జిల్లా ఏర్పడ్డాక మూడు సోలార్‌ పవర్‌ ప్రాజెక్టులు ఏర్పాటయ్యాయి. గత ప్రభుత్వం నిర్మల్‌లో ఐటీడీఏ ఆధ్వర్యంలో తేనెశుద్ధి కార్మాగారం ఏర్పాటు చేసింది. డెయిరీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో పాలశీతలీకరణ కేంద్రం ఉంది. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో సూక్ష్మ చిన్నతరహా ఇలా అన్ని కలిపి సుమారు 260 పరిశ్రమలు ఉన్నాయి. కానీ పెద్ద పరిశ్రమలు మాత్రం కనిపించడంలేదు.

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా..

పరిశ్రమలు ఏర్పడితే జిల్లా ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఇక్కడ రైతులు పండించిన పంటలకు అనుగుణంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. అత్యధికంగా సోయా, శెనగ, మొక్కజొన్న పంటలు పండుతాయి. ఈ పంటల ఆధారంగా పరిశ్రమల ఏర్పాటు జరిగితే రైతులకు మేలు జరుగుతుంది. ఈ విషయం మరోమారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.

– పవార్‌ రామారావు పటేల్‌, ముధోల్‌ ఎమ్మెల్యే

ఒకప్పటి పత్తి దిగ్గజాల కథ

సౌకర్యాలు ఉన్నా..

జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అవసరమైన సహజ వనరులు (భూమి, నీరు, ఖనిజాలు), రోడ్డు–రైలు మార్గాలు ఉన్నాయి. గోదావరి నది పక్కన బాసర, అక్కడికి అనుసంధానించిన జాతీయ రహదారి, రైలుమార్గం వంటివి పారిశ్రామిక అభివృద్ధికి సహాయపడుతాయి. అయినా నిర్మల్‌, ఖానాపూర్‌, బాసర వంటి ప్రాంతాల్లో నడుస్తున్నవి సూక్ష్మ, చిన్నస్థాయి పరిశ్రమలు మాత్రమే. ఒక్క పెద్ద రీజినల్‌ పరిశ్రమ కూడా జిల్లా పరిధిలో లేక అభివృద్ధిలో వెనుకబడుతోంది. గోదావరి దాటిన తర్వాత నిర్మల్‌ సరిహద్దు ప్రారంభమవుతుంది, కానీ ఆ దశలో హైదరాబాద్‌–నాగ్‌పూర్‌ జాతీయ రహదారి పక్కన ఉండే ఇతర జిల్లాల్లో పరిశ్రమలు కనిపిస్తాయి. నిర్మల్‌ ప్రాంతంలో మాత్రం కొత్త పరిశ్రమలు ఎక్కడా కనిపించవు.

భైంసా పట్టణం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పత్తి పారిశ్రామిక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు 33కు పైగా పత్తి జిన్నింగు ఫ్యాక్టరీలు నడుస్తుండేవి. పత్తి సీజన్‌లో ఏటా సుమారు 20 వేల మంది కూలీలకు ఇక్కడ ఉపాధి లభించేది. కానీ పత్తి పంట విస్తీర్ణం తగ్గడం, గులాబీరంగు పురుగు వంటి సమస్యలతో రైతులు పంట సాగును తగ్గించడంతో జిన్నింగు ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ప్రస్తుతం 18 ఫ్యాక్టరీలు కూడా ఆపరేషన్‌లో లేవు. అనేక ఫ్యాక్టరీలను యజమానులు విక్రయించారు. స్థలాలను ప్లాట్లుగా చేసి విక్రయించారు. దీంతో భైంసా పారిశ్రామిక చైతన్యం గణనీయంగా తగ్గిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement