గన్నీ సంచుల కోసం ఆందోళన | - | Sakshi
Sakshi News home page

గన్నీ సంచుల కోసం ఆందోళన

Apr 29 2026 8:42 AM | Updated on Apr 29 2026 8:42 AM

లక్ష్మణచాంద: గన్నీ సంచులు పంపాలని సోన్‌ మండలం పాక్‌పట్ల కొనుగోలు కేంద్రం వద్ద మొక్కజొన్న రైతులు మంగళవారం ఆందోళన చేపట్టారు. పాక్‌పట్ల, జాఫ్రాపూర్‌, సోన్‌ గ్రామాల్లో సుమారు 500 నుంచి 600 ఎకరాలలో మొక్కజొన్న పంట వేశామన్నారు. పాక్‌పట్లలో మంజులాపూర్‌ పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో, సిద్దులకుంటలో ఎఫ్‌ఎస్‌సీఎస్‌ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. అయితే గన్నీ సంచులు ఇవ్వకపోవడంతో రైతులు నిరసనకు దిగారు. వర్షాలు కురిసే అవకాశం ఉందని, త్వరగా కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. గన్నీ సంచులు ఇవ్వాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement