ఇక్కడ డెంటల్ విభాగం వైద్యురాలు తరచూ సెలవులో ఉంటున్నారు. అసలు ఆస్పత్రిలో డెంటల్ సేవలందిస్తున్న విషయం చాలామంది రోగులకు తెలియదు. ఈనెలలో ఇప్పటివరకు కేవలం ఏడుగురు మాత్రమే ఓపీ నమోదైందంటేనే తెలిసిపోతుంది. దీంతో అప్పుడప్పుడు జనరల్ రోగులకు కూడా సేవలందిస్తున్నారు. అయితే, కొన్నిసార్లు విధులకు రాకున్నా హాజరు వేసుకుంటున్నట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం ఉదయం సకాలంలో హాజరు కాకపోవడంతో ఆలస్యంగా వస్తున్నట్లు సిబ్బంది ఉన్నతాధికారులకు రిపోర్టు పంపించారు. అయితే, ఈరోజు ఆమె విధులకే రాలేదని తెలిసింది.


