లక్ష్మణచాంద: మండల కేంద్రంలోని వాణి పబ్లిక్ స్కూల్‌లో వెన్నెల డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపును ఆదివారం నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్‌రెడ్డి ప్రారంభించారు. పిల్ల లకు చదువుతోపాటు డ్యాన్స్ ఆటలు, పాటల ద్వారా మానసిక ఉల్లాసం పెంపొంది చురుకుగా తయారవుతారన్నారు. కార్యక్రమంలో నిర్మల్ ఏఎంసీ వైస్ చైర్మన్ ఈటల శ్రీనివాస్, ఆత్మ కమిటీ చైర్మన్ కొండ్ర రాంరెడ్డి, దేవరకోట ఆలయ మాజీ చైర్మన్ శ్రీనివాస్, నాయకులు డాన్స్ మాస్టర్ ధనరాజ్, జానపద కళాకారుల బృంద సభ్యులు బిరుకుల సురేశ్, సాయి కృప, కావ్య, స్వామి వాణి పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ గంగాధర్ పాల్గొన్నారు.


