సారంగపూర్: జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీఅడెల్లి మహాపోచమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారికి మొ క్కులు చెల్లించుకునేందుకు ఉమ్మడి ఆది లాబాద్ జిల్లాతోపాటు నిజమాబాద్, హైదరా బాద్, కరీంనగర్, వరంగల్‌తోపాటు మహా రాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈసందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. స్థానిక ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు.


