● డిమాండ్ల సాధనకు ఒకరోజు బంద్ ● రైతులకు రాయితీపై అందించే ఎరువులతోపాటు రాయితీ లేని లేదా లింక్ ఉన్న ఉత్పత్తులను కొనుగోలు చేయాలని కంపెనీలు డీలర్లను బలవంతం చేస్తున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో డీలర్లు రైతుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లింక్ ఉత్పత్తులు అంటగట్టడాన్ని కంపెనీలను నిషేధించాలి.
● కంపెనీలు ఎరువులను నేరుగా డీలర్ వద్దకే అందించాలని కోరుతున్నారు. ప్రస్తుతం, రైల్వే హెడ్ల నుంచి మాత్రమే అందిస్తున్నారు. దీంతో అక్కడి నుంచి డీలర్లు తమవద్దకు యూరియా సంచులు తెచ్చుకునేందుకు లారీల్లో రవాణా చార్జీలు భారంగా మారుతున్నాయని పేర్కొంటున్నారు. దీంతో ఒక్కో బస్తాకు రూ.40, రూ.50 ఆర్థిక భారం పడుతోంది. మరోవైపు పీఏసీఎస్, డీసీఎంఎస్‌లకు నేరుగా చార్జీలు లేకుండా రవాణా చేస్తున్నారు. వారు తక్కువ ధరకు విక్రయిస్తుండగా, అధిక రవాణ భారం మోస్తున్న డీలర్లు అధిక ధరలకు విక్రయిస్తే ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
● పెరుగుతున్న కార్మిక, రవాణా ఖర్చులు దృష్టిలో ఉంచుకుని, డీలర్ మార్జిన్ కనీసం 8 శాతానికి పెంచాలని కోరుతున్నారు. ఇవేకాకుండా విత్తనాలు రైతులకు విక్రయించిన క్రమంలో విత్తనాలు మొలకెత్తకపోతే నేరుగా డీలర్‌ను బాధ్యున్ని చేయడాన్ని తప్పుపడుతున్నారు. కంపెనీలను వదిలి డీలర్‌ను బాధ్యుడిని చేయవద ని కోరుతున్నారు. మరికొన్ని డిమాండ్ల సాధనకే ఒకరోజు సమ్మె చేపడుతున్నట్లు చెపుతున్నారు.
భైంసాటౌన్: జిల్లాలో ఆగ్రో డీలర్లు సమ్మెబాట పట్టనున్నారు. ఎరువులు, విత్తనాలు, ఫర్టిలైజర్ డీలర్ల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తమ డిమాండ్ల సాధనకు ఈనెల 27న(సోమవారం) ఒకరోజు బంద్ పాటించనున్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా డీలర్ల సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయాధికారులకు శనివారం సమ్మె నోటీసు అందజేశారు. విత్తన, ఎరువులు, ఫర్టిలైజర్ దుకాణదారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకే ఈబంద్ తలపెట్టినట్లు పేర్కొన్నారు.
ప్రధాన డిమాండ్లు..
సమ్మె జయప్రదం చేయాలి..
తెలంగాణ రాష్ట్ర ఎరువులు, పురుగుమందులు – విత్తనాల డీలర్ల సంక్షేమ సంఘం పిలుపుమేరకు ఈనెల 27న ఒకరోజు సమ్మె పాటిస్తున్నాం. ఈ మేరకు వ్యవసాయాధికారులకు నోటీసు అందించాం. రాష్ట్రవ్యాప్తంగా డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ఒకరోజు సంపూర్ణ బంద్ పాటిస్తున్నాం. డీలర్లు బంద్‌కు సహకరించాలి.
– సంజీవ్‌రెడ్డి, డీలర్ల సంఘం అధ్యక్షుడు, భైంసా