బాసర: నిర్మల్ కలెక్టర్ భవేశ్‌మిశ్రా, తన సతీమణి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఆదివారం బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా అతిథి గృహానికి చేరుకున్న కలెక్టర్ దంపతులకు బాసర ఎంపీడీవో దేవేందర్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ ప్రకాశ్‌జాదవ్ పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆలయానికి చేరుకున్న వీరికి ఆలయ ప్రధాన అర్చకులు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. అమ్మవారి సన్నిధిలో కలెక్టర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, ఆర్‌ఐ అభిమన్యు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


