కులగణనలో గంగపుత్రులకు అన్యాయం | - | Sakshi
Sakshi News home page

కులగణనలో గంగపుత్రులకు అన్యాయం

Apr 27 2026 8:18 AM | Updated on Apr 27 2026 8:18 AM

కడెం: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణనలో గుండ్ల, బెస్త, గంగపుత్రుల పేర్లను ప్రస్తవించలేదని గల్ఫ్‌ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం అధ్యక్షుడు తోకల శంకర్‌ అన్నారు. దుబాయ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన కుల సంఘ సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో లక్షల జనాభా ఉన్న గంగపుత్రుల కులం పేరును కాదని, అగ్నికులచేతియులని ప్రస్తావించారని పేర్కొన్నారు. దీంతో గంగపుత్రుల ఆత్మగౌరవం దెబ్బతింటుందని తెలిపారు. ప్రభుత్వం గుండ్ల, బెస్త, గంగపుత్ర పేర్లను కులగణన జాబితాలో చేర్చాలని కోరారు. గంగపుత్ర సంఘ నాయకులు బింగిరాజు, ప్రధాన కార్యదర్శి గంగనర్సయ్య, మేడి రమేశ్‌, నర్సయ్య, బోరే హిందయ్య, కిసాన్‌, రాజేశ్‌, మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement