జీజీహెచ్‌లో చలివేంద్రం | - | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌లో చలివేంద్రం

Apr 25 2026 9:30 AM | Updated on Apr 25 2026 9:30 AM

నిర్మల్‌చైన్‌గేట్‌: ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో రోగులు, వారి సహాయకుల దాహార్తి తీర్చేందుకు నర్సింగ్‌ ఆఫీసర్ల ఆధ్వర్యంలో శుక్రవారం చలివేంద్రం ప్రారంభించారు. వేసవి తీవ్రత దష్ట్యా ఆస్పత్రికి వచ్చే వారందరూ ఈ ఉచిత తాగునీటి సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. కార్యక్రమంలో మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ గోపాల్‌సింగ్‌, ఆర్‌ఎంవో డాక్టర్‌ రమేశ్‌, డాక్టర్‌ విశ్వనాథ్‌, నర్సింగ్‌ సూపరింటెండెంట్లు వనజ, విజయలక్ష్మి, ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ నవీన్‌, నర్సింగ్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement