న్యూస్‌రీల్
ముసాయిదా ఓటరు జాబితా ప్రకటన
ఎన్నికల నిర్వహణకు అధికారుల ఏర్పాట్లు
ఆశావహుల్లో చిగురిస్తున్న ఆశలు
నిర్మల్
కలెక్టర్‌ను కలిసిన ఖానాపూర్ పాలకవర్గం
వేదం.. జీవన నాదం
బాసరలోని శ్రీవేద భారతి పీఠం ఎంతోమందికి వేదవిద్యను అందిస్తోంది. నిత్యం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వేద జ్ఞానాన్ని
అందించే కల్పవల్లిగా విరాజిల్లుతోంది.
ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన అదనపు కలెక్టర్
నర్సాపూర్(జి): మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు శుక్రవారం పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడారు. మండల కేంద్రానికి ఎన్ని ఇళ్లు మంజూరయ్యాయి.. ఎన్ని పూర్తయ్యాయి వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించి నిర్మాణాలు వేగవంతం చేయాలని, అర్హులకు ఇళ్లు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం ఇంద్రకరణ్‌రెడ్డి, డీఈవో భోజన్న, ఎంపీవో తిరుపతిరెడ్డి, హౌసింగ్ ఏఈ మనీష, పంచాయతీ కార్యదర్శి రాథోడ్ కై లాస్ పాల్గొన్నారు.
నిర్మల్‌చైన్‌గేట్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పరిషత్ ఎన్నికల కోసం గతేడాది సెప్టెంబర్‌లోనే ఓటర్ల జాబితాలను ఖరారు చేసి, నోటిఫికేషన్ ఇచ్చినా, బీసీ రిజర్వేషన్ల విషయంలో కోర్టు తీర్పుతో అప్పట్లో ఎన్నికల ప్రక్రియ ఆగిపోయింది. తాజాగా ఇప్పుడు మళ్లీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. గతంలో ఉన్న ఓటర్లతోపాటు తాజాగా వచ్చిన ఓటర్లను కలుపుకుని ముసాయిదా జాబితాలను జిల్లాల యంత్రాంగం సిద్ధం చేస్తోంది. వాస్తవానికి గురువారమే ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రకటించాల్సి ఉండగా, ఎన్నికల సంఘం శుక్రవారం వరకు గడువు ఇచ్చింది. శుక్రవారం ఆ జాబితాను అధికారులు ప్రకటించారు.
పెరిగిన ఓట్లు 2,293..
2025, జులై 10 నుంచి 2026, ఫిబ్రవరి 5 వరకు ఎన్నికల సంఘం ఆమోదం లభించిన ఓటర్లను సైతం తుది ఓటరు జాబితాలో చేర్చి సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నవీకరణ చేసిన ఓటరు జాబితా ఆధారంగానే ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచనలు అందినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఇందులో భాగంగా ముసాయిదా ఓటర్లు జాబితాను శుక్రవారం అధికారులు ప్రకటించగా గతంతో పోలిస్తే 2,293 ఓట్లు పెరిగినట్లు తెలుస్తుంది.
మళ్లీ రిజర్వేషన్ల ప్రక్రియ?
అప్పటి పరిస్థితుల ఆధారంగా 42 శాతం బీసీ రిజర్వేషన్ ప్రకారం.. జిల్లాలోని ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోమారు రిజర్వేషన్లు పూర్తిచేసి ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
గడువు ముగిసి 22 నెలలు..
జిల్లా పరిషత్, మండల పరిషత్‌ల పదవీకాలం ముగిసి 22 నెలలు అయింది. జిల్లాలో 2019, మే నెలలో 18 జెడ్పీటీసీ, 158 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అదే ఏడాది జూన్ 4న ఫలితాలు వెలువడ్డాయి. అనంతరం కొలువుదీరిన పాలకవర్గాల గడువు 2024 జూన్‌తో ముగిసింది. ఆతర్వాత ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోగా.. అప్పుడప్పుడు చర్చ జరుగుతున్నా రిజర్వేషన్ల వ్యవహారంతో వాయిదా పడుతూ వస్తోంది.
ఖానాపూర్: కలెక్టర్ అభిలాష అభినవ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లును ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు శుక్రవారం కలిశారు. శాలువాతో సత్కరించి మొక్క అందించారు. ఖానాపూర్ పట్టణ అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. కలెక్టర్‌ను కలిసినవారిలో కౌన్సిలర్లు, నాయకులు బొప్పరపు సత్యవతి, గుమ్ముల ఆనంద్, ప్రకాశ్‌గౌడ్, నల్ల రవీందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
వివరాలు..
మండలం ఎంపీటీల మొత్తం పెరిగిన
సంఖ్య ఓటర్లు ఓటర్లు
దస్తురాబాద్ 5 12,894 22
కడెం 10 29,159 139
ఖానాపూర్ 8 23,657 117
పెంబి 5 10,886 13
మామడ 9 26,072 138
లక్ష్మణచాంద 9 24,577 126
నిర్మల్ రూరల్ 7 22,751 143
సారంగాపూర్ 14 39,516 189
సోన్ 8 21,801 105
దిలావర్‌పూ 6 18,744 87
నర్సాపూర్(జి) 7 20,238 111
లోకేశ్వరం 10 29,359 90
కుంటాల 7 19,055 87
భైంసా 11 33,970 278
ముధోల్ 10 28,754 159
తానూర్ 11 31,516 206
బాసర 6 15,728 83
కుభీర్ 14 40,625 200
జిల్లాలో పెరిగిన ఓటర్లు
రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 23 వరకు తుది ఓటరు జాబితా సిద్ధం చేసుకోవాలని, అవసరమైతే.. మే నెలలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలివ్వడంతో పల్లెల్లో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. ఆశావహులు సీట్ల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆయా రాజకీయ పార్టీల్లోని ప్రధాన నాయకులతో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అనుచరులను సమాయత్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
వినియోగదారులను
మోసం చేస్తే చర్యలు
తానూరు: దుకాణదారులు వ్యాపారాల్లో వినియోగదారులకు మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎల్‌ఎంవో శంకర్ హె చ్చరించారు. తానూరులో దుకాణాలు, హో టళ్లు, స్వీట్‌హోంలను శుక్రవారం తనిఖీ చేశా రు. దుకాణాల్లో వినియోగించే త్రాసులు, తూ కం రాళ్లు, ఎలక్ట్రికల్ యంత్రాలు పరిశీలించా రు. సీల్ వేశారు. వస్తువులపై ఉన్న ధర కంటే ఎక్కువకు విక్రయించొద్దని సూచించారు. ని బంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామ ని హెచ్చరించారు. కార్యక్రమంలో తనిఖీ అసిస్టెంట్ అధికారి రాజశేకర్‌రెడ్డి, సిబ్బంది రాజ్‌కుమార్, అయాజ్‌ఖాన్ తదితరులు ఉన్నారు.
మొత్తం ఓటర్లు 4,51,595
పురుషులు 2,14,941
మహిళలు 2,36,642
ఇతరులు 12


