అద్దె బస్సులు.. ఆగమాగం | - | Sakshi
Sakshi News home page

అద్దె బస్సులు.. ఆగమాగం

Apr 25 2026 9:30 AM | Updated on Apr 25 2026 9:30 AM

అన్నా ఆపే.. బస్సు కోసం పరిగెత్తుతున్న ప్రయాణికులు

అంతా మా ఇష్టం.. నిర్మల్‌ బస్టాండ్‌ ఆవరణలో ఇష్టం వచ్చినట్లు పార్కింగ్‌ చేసి ఉన్న ఆర్టీసీ అద్దె బస్సులు

అదుపు తప్పితే.. ఫుట్‌ బోర్డుపై ప్రమాదకరంగా ప్రయాణం

సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, కంట్రోలర్లు మూడు రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో సంస్థ అద్దె డ్రైవర్లు, కండక్టర్లను నియమించి బస్సులు నడుపుతోంది. అయితే తాత్కాలిక డ్రైవర్లు ఇష్టారీతిన బస్సులు నడుపుతూ ప్రయాణికులను ఆగం చేస్తున్నారు. బస్‌ స్టాపుల వద్ద ఆపకుండా వెళ్తున్నారు. దీంతో ప్రయాణికులు పరిగెత్తి బస్సు పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ పడిపోతున్నారు. కొందరు ఫుట్‌బోర్డ్‌పై ఉండగానే ’రైట్‌’ అని డ్రైవర్లు బస్సు స్పీడ్‌గా నడుపుతున్నారు. ఇక అద్దె కండక్టర్లు మిషన్‌ ఆపరేటింగ్‌ రేట్‌ ప్రకారం టికెట్లు ఇవ్వకుండా ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారు. బస్టాండ్‌ ఆవరణలో తాత్కాలిక డ్రైవర్లు బస్సులు ఇష్టానుసారం పార్క్‌ చేస్తున్నారు. ప్రయాణికులు నడవడానికి కూడా స్థలం లేకుండా నిలుపుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్‌ నిర్మల్‌

Advertisement
 
Advertisement
Advertisement