జర్మనీలో నర్సింగ్‌ ఉద్యోగాలు | - | Sakshi
Sakshi News home page

జర్మనీలో నర్సింగ్‌ ఉద్యోగాలు

Apr 25 2026 9:30 AM | Updated on Apr 25 2026 9:30 AM

● ఈనెల 30 వరకు దరఖాస్తుకు అవకాశం

నిర్మల్‌చైన్‌గేట్‌: తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ (టామ్‌కాం) ఆధ్వర్యంలో జర్మనీలో నర్సింగ్‌ ఉద్యోగాల కోసం అర్హులను ఎంపిక చేస్తున్నారు. కార్మిక, ఉపాధి, శిక్షణ కర్మాగారాల శాఖ అధికారులు ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లాలో ఆసక్తి ఉన్నవారు germanytriplewin2025 @gmail. comకు దరఖాస్తులు పంపించాలి.

ఎంపిక ప్రక్రియ

ప్రాథమిక ఇంటర్వ్యూలో జర్మన్‌ భాషా పరిజ్ఞానం అవసరం లేదు. ఎంపికైనవారికి ఉచిత శిక్షణ ఇస్తారు.

● ఆరు నెలల్లో ఏ2 స్థాయి 70 మార్కులతో పాసైతే కొనసాగుతారు.

● తర్వాత ముఖాముఖి టెస్ట్‌, బీ1/బీ2 సర్టిఫికెట్‌ ఉన్నవారికి ఫాస్ట్‌ట్రాక్‌.

● విమాన టికెట్‌ సహా అన్ని ఖర్చులు టామ్‌కాం భరిస్తుంది.

వేతనం ఇలా..

● శిక్షణ కాలంలో నెలకు 2,300 యూరోలు(సుమారు రూ.2.20 లక్షలు).

● పూర్తి గుర్తింపు తర్వాత 2,800 యూరోలు(సుమారు రూ.3 లక్షలు)

● ఓవర్‌టైమ్‌ అలవెన్స్‌తో అదనపు ఆదాయం వస్తుంది.

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌ పూర్తయినవారు జర్మనీలో ఉద్యోగావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎంపికై న వారికి జర్మన్‌ భాషపై శిక్షణ ఇస్తారు. ప్రత్యేక వసతులు, మంచి జీతభత్యాలు ఉంటాయి. మరిన్ని వివరాలకు 94400 51581, 94400 52081, 9440049645 నంబర్లలో సంప్రదించాలి.

– జి.విజయలక్ష్మి, జిల్లా ఉపాధి కల్పన అధికారి

అర్హతలు..

తెలంగాణలో గుర్తింపు పొందిన కళాశాలల నుంచి జీఎన్‌ఎం లేదా బీఎస్‌సీ నర్సింగ్‌ పూర్తి చేయాలి.

వయసు 22 నుంచి 38 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీఎన్‌ఎం అభ్యర్థులకు కనీసం మూడేళ్ల అనుభవం, ఇండియన్‌ నర్స్‌ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ ఉంటే అదనపు అర్హతగా పరిగణిస్తారు.

పాలియేటివ్‌ కేర్‌, హోంకేర్‌, నర్సింగ్‌ హోమ్‌, ఇన్‌ పేషెంట్‌ లేదా ఆసుపత్రి అనుభవం ఉండాలి.

Advertisement
 
Advertisement
Advertisement