భైంసాటౌన్: పట్టణంలోని మహాగాం మార్గంలో మినీ స్టేడియం ఆవరణలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఇటీవల పలువురు రైతులు మినీ స్టేడియంలో సబ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పి.రామారావు పటేల్‌ను కోరారు. స్పందించిన ఎమ్మెల్యే ఈ మేరకు కొనుగోలు కేంద్రం సబ్ సెంటర్ ఏర్పాటు చేయించారు. దీంతో మున్సిపల్ చైర్మన్ తూమోల్ల దత్తాత్రి హాజరై కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో మక్కలు విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు రావుల రాము, కిసాన్‌గల్లి సర్పంచ్ కుంట రాజలింగు, ఉప సర్పంచ్ సాయినాథ్, కౌన్సిలర్ నిమ్మల ప్రవీణ్, వడ్నప్ శ్రీనివాస్, సుభాష్, అమోల్, ఆత్మ డైరెక్టర్ మామిడి స్వామి, రైతులు పాల్గొన్నారు.


