నిర్మల్‌టౌన్: ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని నిర్వహిస్తున్న సమ్మె రెండో రోజు గురువారం కొనసాగింది. జిల్లా కేంద్రంలోని డిపో కార్యాలయం ఎదుట కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. దీంతో ఉదయం నుంచి ప్ర యాణికులు బస్టాండ్ వద్ద ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు ప్రైవేట్ డ్రైవర్లతో బ స్సులు నడిపారు. నిజమాబాద్, ఆదిలాబాద్, భైంసా, ఖానాపూర్ రూట్‌లలో ప్రైవేట్ బస్సులు నడిచాయి. కార్మికులు మాట్లాడుతూ.. త మ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వర కూ సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు.


