బస్సు ఎప్పుడస్తదో.. నిర్మల్ బస్టాండ్‌లో బస్సుల కోసం నిరీక్షణ..
2025–26 విద్యా సంవత్సరం
ముగిసింది. ఏప్రిల్ 24(శుక్రవారం) నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చింది ప్రభుత్వం దీంతో హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు గురువారం సాయంత్రమే ఇంటి బాట పట్టారు. తల్లిదండ్రులకు ముందస్తు సమాచారం ఇవ్వడంతో మధ్యాహ్నమే గురుకులాలకు చేరుకున్నారు. తర్వాత పిల్లలను తీసుకుని బస్టాండ్లకు చేరుకున్నారు. ఆర్టీసీ సమ్మె కారణంగా ఊళ్లకు వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు. ఆదిలాబాద్, నిజామాబాద్, ఖానాపూర్, భైంసా వెళ్లే విద్యార్థులు నిర్మల్ బస్టాండ్‌లో గంటల తరబడి ఎదురుచూశారు. అడపాదడపా వచ్చిన బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణించారు. మరోవైపు ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో చాలా మంది తల్లిదండ్రులు సొంత వాహనాలపై పాఠశాలలకు వచ్చారు. కొందరు ఆటోల్లో పిల్లలను తీసుకెళ్లారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్
హమ్మయ్య బండిమీద పోతున్నం.. ద్విచక్ర వాహనంపై ఇంటి బాట పడుతున్న విద్యార్థులు..


