బడి ఆస్తులు భద్రం | - | Sakshi
Sakshi News home page

బడి ఆస్తులు భద్రం

Apr 24 2026 5:56 AM | Updated on Apr 24 2026 5:56 AM

● సెలవుల్లో రక్షణకు ప్రభుత్వం మార్గదర్శకాలు ● పాఠశాలలోని విలువైన వస్తువులు భద్రపరిచే గదులకు సరైన లాక్‌ వేయాలి. ప్రధాన గేటు వద్ద సరైన తాళాలు వేయాలి. ● పాఠశాలలో విద్యుత్‌ సరఫరా నిలిపివేయాలి. ● ఆస్తుల రక్షణకు పాఠశాల యాజమాన్య కమిటీ, అమ్మ ఆదర్శ కమిటీలు, గ్రామాల్లోని యూత్‌ల సహకారం తీసుకోవాలి. ● సెలవుల సమయాల్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాఠశాలలను విజిట్‌ చేయాలి. ● పోలీసులు పెట్రోలింగ్‌ చేసే సమయాల్లో పాఠశాలలవైపు వెళ్లేగా చర్యలు చేపట్టాలి. ● విద్యార్థుల పోషకుల సహకారం తీసుకోవాలి. ● పాఠశాలలకు సంబంధించిన సమాచారం డిజిటలైజేషన్‌ చేయాలి. ● డీఈవో, ఎంఈవోల ఫోన్‌ నంబర్లు పాఠశాలల వద్ద డిస్‌ప్లే చేయాలి. ● పాఠశాలల సందర్శన బుక్‌లను వాచ్‌మెన్‌ల వద్ద ఉంచాలి. ● అన్ని ఎలాక్ట్రానిక్‌ వస్తువులను స్విచ్‌ ఆప్‌ చేయాలి ● డిజిటల్‌ పాఠాలు బోధించేందుకు పాఠశాలలకు అందచేసిన ఇంటరాక్టివ్‌ ప్యానెల్స్‌ బోర్డులు. ● సైన్స్‌ ప్రయోగశాలలు, అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌లు, విలువైన పరికరాలు, వస్తువులు, కంప్యూటర్లు. ● క్రీడా సామగ్రి, గ్రంథాలయాల బుక్స్‌, నీటిశుద్ధి పరికరాలు, విద్యుత్‌ మోటార్లు, చోరీ కాకుండా చూసుకోవాలి. ● విద్యార్థుల ప్రవేశ రిజిస్టర్లు, ఇతర విలువైన దస్త్రాలు. ● మధ్యాహ్న భోజన బియ్యం సెలవులు పూర్తయ్యే వరకు పురుగులు పట్టకుండా నిల్వ చేయాలి.

లక్ష్మణచాంద: వేసవి సెలవులు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 2025–26 విద్యా సంవత్సరం ముగిసింది. దాదాపు రెండు నెలలు పాఠశాలలు తెరుచుకోవు. ఈ నేపథ్యంలో గతంలో వేసవి సెలవుల్లో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఆస్తులు చోరీ అయ్యాయి. ఆకతాయిలు ధ్వంసం చేశారు. దీంతో సెలవుల్లో పాఠశాలల ఆస్తుల సంరక్షణ ప్రధాన సమస్యగా మారింది. సెలవుల్లో గుర్తుతెలియని వ్యక్తులు వెళ్లి కిటికీలు, తాళాలు, తలుపులు ధ్వంసం చేఉసిన సంఘటనలు ఉన్నాయి. ఈసారి పాఠశాలల ఆస్తుల రక్షణకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్‌ నికోలస్‌ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు.

పీఎంశ్రీ పాఠశాలల్లో సీసీ కెమెరాలు..

జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలల ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటికి ప్రధానోపాధ్యాయుడితోపాటు, పీడీ, ఒక సీనియర్‌ ఉపాధ్యాయుడికి అనుసంధానం చేశారు. దీంతో నిరంతరం వాటిని చూస్తుడంటతో పాఠశాలలకు ఎవరు వస్తున్నారు అనేది ఇట్టే తెలిపోతుందని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అంటున్నారు.

మార్గదర్శకాలు ఇవే...

భధ్రపరచాల్సిన వస్తువులు ఇవే...

లక్ష్మణచాంద పాఠశాలలో సీసీ కెమెరా

జిల్లా సమాచారం....

ప్రాథమిక పాఠశాలలు 577

ప్రాథమికోన్నత పాఠశాలలు 89

ఉన్నత పాఠశాలలు 164

కేజీబీవీలు 18

పోషకులు దృష్టి సారించాలి...

ప్రభుత్వ పాఠశాలల ఆస్తుల రక్షణ కోసం ఆయా పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల పోషకులు కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. తమ గ్రామాల్లోని పాఠశాలల ఆస్తుల రక్షణ గ్రామ యువత, పోషకులు తమ బాధ్యతగా భావిస్తే ఎటువంటి నష్టం జరగకుండా ఉంటుంది. వేసవి సెలవుల సమయంలో తాత్కాలిక పద్ధతిన రాత్రి సమయంలో కాపాలదారులు నియమించాలని పలువురు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి తాత్కాలిక పద్దతిలో నియమించుకోవాలని ఎటువంటి ఆదేశాలు రాలేవని అధికారులు అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement