భైంసాటౌన్: డివిజన్ కేంద్రమైన భైంసా పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి భైంసా నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రా మాలు, మండలాల నుంచి సైతం రోగులు వస్తుంటారు. ప్రస్తుతం రోజుకు 300 నుంచి 400 మంది పేషెంట్లు వస్తున్నారు. అయితే ఆస్పత్రిలో మొత్తం 28 మంది వైద్యులు ఉండగా 10 నుంచి 14 మంది మాత్రమే విధుల్లో కనిపిస్తున్నారు. వీరిలోనూ కొందరు మాత్రమే సకాలంలో విధులకు హాజరవుతున్నారు. మరికొందరైతే విధులకు వచ్చినా.. ఓపీ గదుల్లో మాత్రం కనిపించడం లేదని రోగులు వాపోతున్నారు. బుధవారం ఆస్పత్రిని ‘సాక్షి’ విజిట్ చేయగా 12:45 గంటలకే ఓపీ గదులకు తాళాలు కనిపించాయి. వైద్యులకు ముఖ గుర్తింపు హాజ రు ఇక్కడ అమలు కావడం లేదు. ప్రస్తుతం వేసవికాలం కావడంతో వడదెబ్బ, నీరసం, డయేరియా వంటి వ్యాధులతో రోగులు అధిక సంఖ్యలో ఆస్పత్రికి వస్తున్నారు. అయితే, వార్డులో ఫ్యాన్లు ఉన్నా వేడిగాలితో ఇబ్బంది పడుతున్నారు. తాగునీటికి ఇబ్బంది లేదు.
పేరుకే వైద్యులు.. విధుల్లో కానరారు..!
Apr 24 2026 5:56 AM | Updated on Apr 24 2026 5:56 AM
● ముధోల్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆపరేషన్ వసతి లేదు. ఎక్స్‌రే లేదు. పోస్టుమార్టం కో సం భైంసా వెళ్లాల్సిందే. పురాతన భవనం కావడంతో వర్షాకాలంలో రోగులు, వైద్యు లు, ఇబ్బంది ఇబ్బంది పడుతు న్నారు.
● భైంసా మండలంలోని మహగాం పీహెచ్ సీలో సిబ్బంది కొరత ఉంది. ఒక మెడికల్ ఆఫీసర్ పోస్టు ఖాళీగా ఉండగా, ఇద్దరు స్టాఫ్ నర్సులే అత్యవసర సేవల నుంచి సాధారణ పరీక్షల వరకు భారం మోస్తున్నారు. ఆస్పత్రిలో ఫ్యాన్లు, తాగునీరు, మందులు అందుబాటులో ఉన్నాయి.
● తానూరు పీహెచ్‌సీలో వైద్యాధికారి పోస్టు ఖాళీగా ఉంది. బాసర అధికారి ఇన్‌చార్జిగా ఉన్నారు. దీంతో ఎంఎల్‌హెచ్‌పీ, స్టాఫ్‌నర్స్‌తోనే రోగులకు వైద్య సేవలందిస్తున్నారు. ఇక్కడి సూపర్‌వైజర్లను భైంసా ఆస్పత్రికి డిప్యూటేషన్‌పై పంపించారు. ఆస్పత్రిలో మందులు అందుబాటులో ఉన్నాయి.
● కుంటాల పీహెచ్‌సీలో స్టాఫ్‌నర్స్, ఫార్మసిస్ట్, ఏఎన్‌ఎం పోస్టులు ఖాళీగా ఉన్నా యి. మరుగుదొడ్లకు నీటివసతి లేక నిరుపయోగంగా మారాయి. ఫ్యాన్లు, తాగునీరు, మందులు అందుబాటులో ఉన్నా యి.
● లోకేశ్వరం పీహెచ్‌సీలో మందులు అందుబాటులో ఉన్నాయి. వానాకాలంలో వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు ఇబ్బంది ఏర్పడుతోంది.
Advertisement


