నిర్మల్‌ఖిల్లా: వన మహోత్సవంలో మొక్కలు నాటేందుకు ఇప్పటి నుంచే సంబంధిత శాఖల అధికారులు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అటవీ, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి, ఎకై ్సజ్, మున్సిపల్, తదితర శాఖ ల ఆధ్వర్యంలో నాటే మొక్కలకు సంబంధించి ప్ర ణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతీశాఖ ఆధ్వర్యంలో వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, డీఎఫ్‌వో సుశాంత్ సుఖదేవ్ బోబడే, డీఆర్డీవో విజయలక్ష్మి, డీపీవో శ్రీనివాస్, ఎకై ్సజ్ అ ధికారి ఎంఏ రజాక్, డీఈవో భోజన్న, జెడ్పీసీఈవో భాగ్యలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


