‘ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి’ | - | Sakshi
Sakshi News home page

‘ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి’

Apr 23 2026 8:48 AM | Updated on Apr 23 2026 8:48 AM

భైంసాటౌన్‌: కుభీర్‌ మండలంలోని సౌన గ్రామస్తులకు ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూమిలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జే.రాజు బుధవారం సబ్‌ కలెక్టర్‌ అజ్మీర సంకేత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1983లో వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన సౌన గ్రామస్తులకు సర్వే నెం.10లో భూమిని కేటాయించి పట్టాలిచ్చారని, అయితే, ప్లాట్ల కేటాయింపు జరగలేదన్నారు. దీంతో ఏటా వరద నీటితో గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. కార్యక్రమంలో శేషరావు పటేల్‌, గణపతి, మారుతి పటేల్‌, చంద్రే భీంరావు, కే మారుతి, లక్ష్మణ్‌, భోజరాం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement